Friday, 10 August 2018

రాజమహేంద్రవరంలో 22 గ్రామాలు విలీనం ఈసారైనా జరిగేనా?

రాజమహేంద్రవరంలో 22 గ్రామాలు విలీనం ఈసారైనా జరిగేనా?

రాజమండ్రి నగరపాలక సంస్థగా మారిన సుమారు 15 సంవత్సరాల నుండి 9 గ్రామాలు, 13 గ్రామాలు, 21 గ్రామాలు విలీనం జరుగుతుంది అనేక మార్లు వార్తల్లో రావడం, నేతల హడవిడి, ప్రతిపక్ష నేతలు కోర్టుకు వెళ్ళి విలీనాన్ని ఆపివేయడం జరుగుతూనే ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం 21 గ్రామాలు విలీనం చేస్తూ జీ.ఓ. పాస్ చెయ్యడంతో ఈసారి ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్నారంతా, కాని ఏమి జరగలేదు. టి.డి.పి. ప్రభుత్వం వచ్చిన తరువాతైనా ఇది జరుగుతుంది అనుకుంటే, నాలుగేళ్ళైనా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మధ్య మధ్యలో 13 గ్రామాలు మాత్రమే కలుపుతారు లేదా 16 గ్రామాలు మాత్రమే కలుపుతారు అనే వార్త చక్కెర్లుకొట్టింది. తీరా చూస్తే అదీలేదు. మాస్టర్‌ప్లాను 13 గ్రామలతో విస్తరించినా, విలీనానికి ప్రతిపాదించిన మిగిలిన 8 గ్రామాలను అందులో చేర్చలేదు. రాజమండ్రి కౌన్సిల్ సమావేశంలో మిలిగిన 8 గ్రామాలను కూడా మాస్టర్‌ప్లానులో చేర్చాలని తీర్మానించినా ఇప్పటివరకు అది ప్రైవేట్ కన్సల్టెంట్‌కి అప్పగించారన్న కబురులేదు. రాజమండ్రి గ్రామీణం ఎం.ఎల్.ఏ. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మిగిలన 8 గ్రామాలు తో మాస్టర్ ప్లాను మరియు విలీనం ఈ నవంబర్‌లోగా తప్పక జరుగుతుంది అని ఒకానొక ప్రెస్ మీట్‌లో చెప్పారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు కేంద్ర పధకాల ద్వార వచ్చే నిధులతో అభివృద్ధి చేసి, 2018 నవంబర్ సమాయనికి విలీనం చెయ్యడం జరుగుతుంది అని కాస్త బుజ్జగించడానికి ప్రయత్నించారు. అయితే ఇప్పటివరకు దాని ఊసేలేకపోవడంతో టి.డి.పి. ప్రభుత్వం కూడా దీనికి తిలోదకాలు వదిలేసిందనే అనుకోవాలి.

ఈ విధంగా అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం రాజమహేంద్రవరం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పి ఓట్లు దండుకోవడమే తప్ప నిజంగా ఈ ఊరు అభివృద్ధికి కొంచమైనా సహయపడదాం అని ఏమాత్రము లేదు. గ్రామాలు విలీనం ప్రతిపాదించిన తరువాత తెలంగాణలోని వరంగల్ లో 42 గ్రామాలు విలీనం జరిగి, స్మార్ట్ సిటీగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. రాజమండ్రి కన్నా చిన్న నగరమైన కరీంనగర్ కూడా విస్తరించి స్మార్ట్ సిటీ కూడా అయ్యింది. కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా ఈ ప్రభుత్వం నేర్చుకుంటే బాగుంటుంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇటు ఆంధ్రలో, అటు తెలంగాణలో ప్రధాన నగరాల్లన్నీ, ఒక్క రాజమండ్రి తప్ప, అన్ని ఏదో విధంగా లాభపడ్డాయి. విజయవాడ/గుంటూరు రాజధాని అయ్యింది, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలకు స్మార్ట్ సిటీ హొదా, సెంట్రల్ విద్యా సంస్థలు వచ్చాయి, నెల్లూరు, విజయవాడ, గుంటూరులకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ వచ్చింది, కర్నూలుకు ట్రిపుల్ ఐటీ, అనంతపూర్ కి కియా ఆటోమోబైల్ పరిశ్రమ, తిరుపతి కి మోబైల్ కంపెనీలు ఇలా అన్ని నగరాలలో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. కాని రాజమండ్రిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ముక్కుతూ మూలుగుతూ 13కోట్లతో ప్రకటించిన స్మార్ట్ సిటీలలో కూడా రాజమండ్రిని చేర్చలేదు. ఇంత కన్నా అన్యాయం మరొక్కటి ఉండదు. మచిలిపట్నానికి కూడ ఒక ప్రత్యేక పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం, రాజమండ్రికి ఎప్పటినుండొ ప్రకటిస్తాం అని చెప్పిన పట్టణాభివృద్ధి సంస్థను తీసుకు వెళ్ళి కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థలో మొక్కుబడిగా కలిపి, గోదావరి అని నామకరణం చేసి చేతులు దులుపేసుకున్నారు.  మన జిల్లాకు చెందిన ఇద్దరు పెద్ద నేతలూ రాజమండ్రి అంటే ఎదో పక్క దేశంలో ఉన్నట్లు వ్యవహరిస్తుంటారు. 

ఎన్నికలు దగ్గరపడుతుండగా ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు కొట్టుకుచస్తున్నారు. ఇంకా రాజమండ్రికి అదిచేస్తాం, ఇదిచేస్తాం అని మళ్ళీ ఊదరగోడతారు. జనాలు పిచ్చివెదవ్వల్లాగా ఈ వెధవలకే ఓటువేస్తారు, రాజమండ్రి అభివృద్ధికి కొంచమైనా పాటుపడతారులే అని ఆశిస్తారు, చివరికి నిరాశే మిగులుతుంది. ఇప్పటికైన మన నేతలు సిగ్గుపడి, కనీసం ఈ గ్రామలు విలీనమైన ఈ నవంబర్‌లోగా జరిగే విధంగా ప్రయత్నిస్తారని ఆశిద్ధాం, అది వారి చేతకాకపోతే, మళ్ళీ ఓట్లు కోసం బిచ్చగాళ్ళలాగా తిరగకుండా ఇంట్లో కూర్చుంటారని కోరుకుందాం. 

No comments:

Post a Comment